తెలంగాణలో కొత్తగా 622 కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 06/12/2020 08:59 IST

తెలంగాణలో కొత్తగా 622 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 57,308 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 622 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,73,341కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న  కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1472కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 993 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,63,744కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,125 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 6,116 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 57,79,490కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 104 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని