close

తాజా వార్తలు

Updated : 11/08/2020 19:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చీఫ్‌ ఇంజినీర్ల ప్రాదేశిక ప్రాంతాల సంఖ్య పెంపు

నీటిపారుదల శాఖ సమీక్షలో కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ నీటిపారుదల రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మార్పులకు అనుగుణంగా శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగునీటి వసతులు, ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు పెరిగాయన్నారు. పంప్‌హౌస్‌లు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని చెప్పారు. అందుకే జలవనరులశాఖలో సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. గతంలో లాగా కాకుండా జలవనరులశాఖ అంతా ఒక విభాగంలోనే పనిచేస్తోందని చెప్పారు. చీఫ్‌ ఇంజినీర్ల ప్రాదేశిక ప్రాంతాల సంఖ్యను 13 నుంచి 19కి పెంచినట్లు పేర్కొన్నారు. 

సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఆదిలాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, రామగుండం, వరంగల్‌, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్‌,  సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ ఉండనున్నాయి. ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ ఎత్తిపోతలు, జలాశయాలు, ఆనకట్టలు, పంప్‌హౌస్‌లు, కాల్వలు, సబ్‌స్టేషన్లు సీఈ పరధిలోనే ఉంటాయని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నీటిపారుదలశాఖ ఇకపై కేవలం జలవనరులశాఖగా మాత్రమే కొనసాగుతుందని కేసీఆర్‌ తెలిపారు. మెదక్‌ జిల్లాలోని ఘనపూర్‌ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. కాకతీయులు నిర్మించిన పాకాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.