close

తాజా వార్తలు

Updated : 20/01/2021 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టు కీలక ఆదేశం 

హైదరాబాద్‌: ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆ పథకాలకు సంబంధించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం 2016లో బీఆర్‌ఎస్‌ పథకం తీసుకొచ్చింది. ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు స్వీకరించింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 2016లో తీసుకొచ్చిన బీఆర్‌ఎస్‌ పథకంపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నంటిపై బుధవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోందని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని ఏజీ వివరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైకోర్టుకు, పిటిషనర్లకు సమర్పించాలని ఈ సందర్భంగా హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం ఏజీని ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము గడువు ఈనెల 31తో ముగుస్తోందని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ కింద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది.

ఇవీ చదవండి...

ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి

ప్రతి హిందువు భాగస్వామి కావాలి: బండి



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని