TS: ప్రభుత్వ నివేదికపై హైకోర్టు అసంతృప్తి
close

తాజా వార్తలు

Updated : 27/04/2021 18:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: ప్రభుత్వ నివేదికపై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక సరిగా లేదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కరోనా కేసులు, మరణాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది. పదేపదే ఆదేశిస్తున్నా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. రోజూ జిల్లాల వారీగా బులెటిన్‌ ఇవ్వాలని.. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం హితం యాప్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మినీ పురపోరు ఎన్నికలతో కరోనా ఉద్ధృతి పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు మినీ పురపోరుకు సంబంధించి పోలింగ్‌ బూత్‌ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల వేళ కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 29లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఎస్‌ఈసీని ఆదేశించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని