close

తాజా వార్తలు

Updated : 27/01/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కనీస వేతనం రూ.19 వేలు ఉండాలి..

పీఆర్సీ నివేదికను నేడు బహిర్గతం చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌: ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫార్సు చేసింది. అలాగే పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన పీఆర్సీ నివేదికను నేడు ప్రభుత్వం బహిర్గతం చేయనుంది. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం వివరాలు ఇవ్వనుంది.

పీఆర్సీ చేసిన సిఫార్సులు..

 మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు.

♦ ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు ఉండాలని ప్రతిపాదన

♦ గరిష్ఠ వేతనం రూ. 1,62,070 వరకూ ఉండొచ్చని సిఫార్సు

♦ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలని సిఫార్సు..

♦ హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తూ సిఫార్సు..

   గ్రాట్యూటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు..

♦  శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపు..

♦  సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలి..

2018 జులై 1 నుంచి ఈ వేతన సవరణ అమలుకు కమిషన్‌ సిఫార్సు చేసింది. ఈ నివేదికపై ఉద్యోగ సంఘాలతో అధికారులు చర్చించనున్నారు.

ఇవీ చదవండి..

ఒక్క రోజూ గడువు పొడిగించం ఏడాదైనా కౌంటర్లు దాఖలు చేయరా!

 
Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని