అమెరికాలో జగిత్యాల వాసి విన్యాసాలు
close

తాజా వార్తలు

Published : 26/02/2021 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికాలో జగిత్యాల వాసి విన్యాసాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని మ్యాడిసన్‌ నగరంలో ఘనీభవించిన సరస్సుపై జగిత్యాల జిల్లా వాసి సూర్య నమస్కారాలతో ఆకట్టుకున్నాడు. సరస్సుపై 23 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి అబ్బురపరిచాడు. మెట్‌పల్లి మండలం వెళ్లుల్లకు చెందిన ప్రవీణ్‌ ఇప్పటికే పలు సాహసాలు చేశాడు. నాలుగేళ్లలో 11 పర్వతాలు అధిరోహించి ప్రశంసలందుకున్నాడు.

వడోదరలో యోగా శిక్షకుడిగా పనిచేసిన ప్రవీణ్‌ ఇప్పటివరకు మణి మహేశ్‌ కైలాష్‌, ఎవరెస్ట్‌‌, మేరా పర్వతం సహా ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియాలోని పలు పర్వతాలను అధిరోహించారు. అమెరికాలోని నార్త్‌ కరోలినా ప్రాంతంలోని మౌంట్‌ సోమా శిఖరాన్ని అధిరోహించి లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని