Sun Light and Plastic: ప్లాస్టిక్‌ ముప్పునకు సూర్యకాంతి తోడైతే..?

తాజా వార్తలు

Updated : 15/09/2021 09:14 IST

Sun Light and Plastic: ప్లాస్టిక్‌ ముప్పునకు సూర్యకాంతి తోడైతే..?

వేల సంఖ్యలో కొత్త రసాయనాలు

వాషింగ్టన్‌: చౌకైన ప్లాస్టిక్‌ బ్యాగులతో పర్యావరణపరంగా, ఆరోగ్యపరంగా ఊహించినదాని కన్నా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ఇవి ఎండలో ఎండి, వాటి నుంచి వేల సంఖ్యలో కొత్త రసాయనాలు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఇదేదో సుదీర్ఘకాలంలో సాగే ప్రక్రియ కాదని, రోజుల వ్యవధిలోనే ఇలా జరుగుతున్నట్లు తెలిపారు. వుడ్స్‌ హోల్‌ ఓషనోగ్రఫిక్‌ ఇన్‌స్టిట్యూషన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ప్లాస్టిక్‌ సంచులు ఒకసారి వాడేశాక చాలావరకూ రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు తరలకుండా నేలలో కలుస్తున్నాయి. వాటిలో చాలామేర గాల్లో ఎగురుతూ నీటి ప్రవాహాల్లోకి గానీ మహాసముద్రాల్లోకి గానీ చేరుతున్నాయి. ఇప్పటికే అక్కడ పేరుకుపోయిన 6.40 లక్షల టన్నుల ప్లాస్టిక్‌కు ఇవి తోడవుతున్నాయి. అవి సముద్రజీవులు, పక్షుల పేగుల్లోకి చేరుతున్నాయి. అక్కడ అవి సూక్ష్మ తునకలుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తాజాగా శాస్త్రవేత్తలు దీనిపై మరింత లోతుగా పరిశోధన చేశారు. కొన్ని వాణిజ్య చిల్లర దుకాణాల నుంచి సేకరించిన పాలీఇథలీన్‌ సంచులపై ప్రయోగాలు నిర్వహించారు. వాటిలో కొన్నింటిని సూర్యకాంతిని పోలిన వాతావరణ పరిస్థితుల్లో ఉంచారు. కాంతిలో ఉంచిన ప్లాస్టిక్‌ పదార్థాలను ఉప్పునీటిలో ఉంచినప్పుడు పెద్ద సంఖ్యలో కొత్త రసాయనాలను వెలువరించాయని పేర్కొన్నారు. అనేక విష పదార్థాలకు ఇది ఆస్కారమిస్తోందని చెప్పారు. వేల ఆర్గానిక్‌ పదార్థాలతో కూడిన ఒక ప్లాస్టిక్‌ సూప్‌ తయారవుతోందని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని