Corona: కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా కరోనా వైరస్‌కు అడ్డుకట్ట!

తాజా వార్తలు

Updated : 14/10/2021 08:04 IST

Corona: కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా కరోనా వైరస్‌కు అడ్డుకట్ట!

సరికొత్త పదార్థాన్ని సృష్టించిన అమెరికా శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: మానవ కణాల్లోకి ప్రవేశించకుండా కరోనా వైరస్‌ను అడ్డుకునే సరికొత్త పదార్థాన్ని వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పేరు- ‘ఎంఎం3122’.  మనిషి జీవకణాల్లోకి చొచ్చుకెళ్లేలా వైరస్‌ను అనుమతిస్తున్న ‘ట్రాన్స్‌మెంబ్రేన్‌ సెరైన్‌ ప్రొటీస్‌-2’ అనే మాంసకృత్తును ఈ కొత్త పదార్థం సమర్థంగా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనితో యాంటీవైరల్‌ ఔషధాన్ని రూపొందిస్తే... కొవిడ్‌ బాధితుల్లో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత పెరగదని, మరణముప్పు దూరమవుతుందని పరిశోధనకర్త జేమ్స్‌ జనెట్కా చెప్పారు. ‘‘కొవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా, కరోనా ముప్పు తప్పడం లేదు. మహమ్మారి నుంచి బాధితులను రక్షించేందుకు సరైన ఔషధాలను అందించాల్సి ఉంది. ఆ దిశగా పరిశోధన సాగించి, కొత్త రసాయన పదార్థాన్ని తయారుచేశాం. ఊపిరితిత్తులపై ఉండే ట్రాన్స్‌మెంబ్రేన్‌ సెరైన్‌ ప్రొటీస్‌-2, మట్రిప్టాస్‌ ప్రొటీన్లు కరోనా వైరస్‌ను ఆహ్వానించి, మానవ కణాలు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యేందుకు సహకరిస్తాయి. కొత్త పదార్థం ఈ ప్రొటీన్లను అడ్డుకుని, ఇన్‌ఫెక్షన్‌ను విస్తరించనివ్వదు’’ అని జేమ్స్‌ తెలిపారు. ఈ పరిశోధన వివరాలను ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ పత్రిక అందించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని