Karnataka: దారిలో అడ్డుకొని.. బాలికపై కామాంధుల దాడి

తాజా వార్తలు

Updated : 26/07/2021 08:40 IST

Karnataka: దారిలో అడ్డుకొని.. బాలికపై కామాంధుల దాడి

చిత్రదుర్గం, న్యూస్‌టుడే : కామాంధుల వికృత చేష్టలకు ఓ నిండు జీవితం బలైపోయింది. పొలం చూడ్డానికి వెళ్లిన ఆ బాలిక (13) మళ్లీ ఇంటికి చేరనేలేదు. కామాంధుల చేతిలో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. చిత్రదుర్గం ఎస్పీ రాధిక అందించిన సమాచారం ప్రకారం.. భరమసాగర ఠాణా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఆ బాలిక శనివారం మధ్యాహ్నం ఒంటరిగా పొలం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. దారి మధ్యలో బాలికను కొందరు దుండగులు అడ్డుకుని సమీప మొక్కజొన్న పొలంలోకి లాక్కొని వెళ్లినట్లు గుర్తించారు.

అక్కడే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం.. బయట ప్రపంచానికి చెబుతుందనే భయంతో ఆ దుండగులు ఆమెను హతమార్చి పరారయ్యారు. బాలిక ఎంత సేపటికీ ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆందోళనతో పొలాల్లో గాలించారు. ఓ మొక్కజొన్న చేనులో ఆమె మృతదేహం కనిపించడంతో ఊరంతా కన్నీరు మున్నీరయ్యింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆదివారం రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన దావణగెరె తూర్పు వలయం ఐజీపీ రవి, ఎసీ్పీ రాధిక తదితరులు బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి.. నిందితుల వేట సాగిస్తున్నామని ఎస్పీ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని