మొదటి పెళ్లి దాచి.. ఎస్సై రెండో వివాహం
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 08:29 IST

మొదటి పెళ్లి దాచి.. ఎస్సై రెండో వివాహం

ఎస్సై మధు

బేగంపేట(అమీర్‌పేట), కార్వాన్‌, న్యూస్‌టుడే: మొదటి పెళ్లి దాచిపెట్టి మరో మహిళను రెండో వివాహం చేసుకున్న టప్పాఛబుత్రా ఎస్సై మధును నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌ చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించడంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన మధు ఉయ్యాల గతంలో బేగంపేట పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పనిచేశాడు. ఆ తరువాత చిలకలగూడ ఠాణాకు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం పోయిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటికే సదరు మహిళ భర్తతో విడాకులు తీసుకున్నట్లు తెలుసుకున్న ఎస్సై తనకు పెళ్లి కాలేదని చెప్పి ఆమెతో ప్రేమాయణం సాగించాడు. సికింద్రాబాద్‌లో ఓ ఆలయంలో వివాహం చేసుకొని మల్కాజిగిరిలో కాపురం పెట్టాడు. అతడు రాత్రి వేళల్లో ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమె ఆరా తీసింది. మొదటి భార్య ఉండగానే తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు గుర్తించింది. ఇటీవల బేగంపేట, టప్పాఛబుత్రా పోలీసులకు, పశ్చిమ మండల డీసీపీకి ఫిర్యాదు చేసింది. ఈ నెల 15న నగర పోలీసు కమిషనర్‌ మధును సస్పెండ్‌ చేశారు. అయితే, తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదని మనస్తాపం చెందిన బాధితురాలు ఈ నెల 19న సికింద్రాబాద్‌ సమీపంలోని పరేడ్‌గ్రౌండ్‌ ప్రాంతంలో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గతంలో చిలకలగూడ పోలీసు స్టేషన్‌లో పనిచేసే సమయంలోనూ మధు ఒకసారి సస్పెండ్‌ అయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని