Crime News: కూతురిని బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం

తాజా వార్తలు

Updated : 15/09/2021 07:46 IST

Crime News: కూతురిని బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం

కేశవగిరి, న్యూస్‌టుడే: కూతురిపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ.. ఎవరికైనా చెబితే అంతుచూస్తానని భయపెట్టాడో కసాయి సవతి తండ్రి. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ కథనం ప్రకారం.. పాతబస్తీ బండ్లగూడలోని గౌస్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మహిళకు కూతురు(14), ఇద్దరు కుమారులు. భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న మహిళ 2017లో అంబర్‌పేటకు చెందిన వ్యాపారి (45)ని పెళ్లి చేసుకుంది. అతనికి అప్పటికే వివాహం కాగా భార్యతో అంబర్‌పేటలో ఉంటున్నాడు. అప్పుడప్పుడూ గౌస్‌నగర్‌లోని రెండో భార్య వద్దకు వచ్చి వెళ్తుండే వాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం కూతురును భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఈనెల 13వ తేదీన ఈ దుశ్చర్యను తల్లి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కె.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని