TS News: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు టీ-శాట్‌లో ‘వీఎల్‌ఎస్‌ఐ’ శిక్షణ

తాజా వార్తలు

Published : 26/07/2021 08:04 IST

TS News: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు టీ-శాట్‌లో ‘వీఎల్‌ఎస్‌ఐ’ శిక్షణ

ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం టీ-శాట్‌ నెట్‌వర్క్‌ ఛానెళ్ల ద్వారా వెరీ లార్జ్‌ స్కేల్‌ ఇంటిగ్రేషన్‌(వీఎల్‌ఎస్‌ఐ) ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్స్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ నైపుణ్య శిక్షణ సంస్థ (టాస్క్‌), ఫొటానిక్స్‌ వాలి కార్పొరేషన్‌ (పీవీసీ), వేదా ఐఐటీ సంయుక్తంగా నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి ప్రతిరోజు ఉదయం 8.15 నుంచి 10.30 గంటల వరకు 15రోజుల పాటు వీఎల్‌ఎస్‌ఐ ఎలక్ట్రానిక్స్‌ సెమికండక్టర్స్‌ శిక్షణ పాఠ్యాంశాలను బోధించనున్నట్లు వివరించారు. రాత్రి 7-9 గంటలకు ఈ కార్యక్రమం పునఃప్రసారం జరుగుతుందన్నారు. ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్స్‌ రంగంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని, ఈ రంగంలో 75 శాతం విదేశీ దిగుమతుల్ని నిలువరించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో శిక్షణ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ డిజైన్‌, తయారీలో వీఎల్‌ఎస్‌ఐ టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యత ఉందని, 2025 నాటికి ఈ రంగంలో 400 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ సొంతం చేసుకునేలా లక్ష్యంతో దేశం ముందుకు వెళ్లాల్సిన అవసరముందని వివరించారు. వీఎల్‌ఎస్‌ఐ పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తి కోసం 040-23540326, 23540726, టోల్‌ఫ్రీనంబరు 18004254039నంబర్లలో సంప్రదించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని