బెట్టింగ్‌ బంగార్రాజు: స్నేహితురాలితో కలిసి ఆమె సోదరి ఇంట్లో ఆభరణాల చోరీ

తాజా వార్తలు

Updated : 15/09/2021 08:01 IST

బెట్టింగ్‌ బంగార్రాజు: స్నేహితురాలితో కలిసి ఆమె సోదరి ఇంట్లో ఆభరణాల చోరీ

చింత రాజు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బెట్టింగ్‌లకు అలవాటు పడి చిన్ననాటి స్నేహితురాలితో కలిసి ఆమె సోదరి ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన ఇది. జూబ్లీహిల్స్‌ ఠాణా డీఐ ఆకుల రమేష్‌, డీఎస్సై హరీశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలానికి చెందిన చింత రాజు కార్మికనగర్‌లో నివసిస్తున్నాడు. అదే కాలనీలో ఆయనతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న జ్యోతి ఉంటోంది. రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉంది. ప్రైవేటు మెడికల్‌ సంస్థలో పనిచేస్తున్న రాజు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. జీతంతో పాటు అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లకు ఖర్చు చేసేవాడు. ఆయన తల్లికి కిడ్నీ సంబంధిత సమస్య ఉండటంతో డయాలసిస్‌ చేయించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే తల్లి చికిత్స నిమిత్తం డబ్బు అవసరమని స్నేహితురాలిని నమ్మించాడు. జ్యోతి ఇంటి పక్కనే ఉండే ఆమె సోదరి విజయ, తల్లి అనసూయతో కలిసి పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి వెళ్లారు. ఇదే అదనుగా రాజు, జ్యోతి కలిసి వారి ఇంటి తాళం పగులగొట్టి బీరువా తాళాలు తీసి బంగారు ఆభరణాలు  తస్కరించారు. వాటిని రాజు తనఖా పెట్టిన సుమారు రూ.4లక్షల రుణం తీసుకున్నాడు. బెట్టింగ్‌ల్లో ఆ డబ్బు పోగొట్టుకున్నాడు. వారం క్రితం తిరిగొచ్చిన విజయ ఇంట్లో చోరీ జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. రాజును అరెస్ట్‌ చేసి 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి పరారీలో ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని