Cinema News: రోడ్డు ప్రమాదంలో నటికి తీవ్ర గాయాలు..

తాజా వార్తలు

Updated : 25/07/2021 13:26 IST

Cinema News: రోడ్డు ప్రమాదంలో నటికి తీవ్ర గాయాలు..

చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో కోలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. వీకెండ్‌ సందర్భంగా శనివారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి యాషిక మహాబలిపురం లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వీరి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు భవానీ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన యాషిక, ఆమె మరో ఇద్దరు స్నేహితులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

యాషిక ‘దురవంగల్‌ పత్తినారుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. అనంతరం కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రియాల్టీ షోలోనూ సందడి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని