TS NEWS:  తెలంగాణలో ‘సీపీజీఈటీ-2021’ నోటిఫికేషన్‌ విడుదల

తాజా వార్తలు

Updated : 28/07/2021 16:55 IST

TS NEWS:  తెలంగాణలో ‘సీపీజీఈటీ-2021’ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలోని వర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘సీపీజీఈటీ-2021’ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనమేరకు సీపీజీఈటీ సెట్‌ను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈనెల 30 నుంచి ఆగస్టు 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు సీపీజీఈటీ సెట్‌ కన్వీనర్‌ పాండు రంగారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం  కల్పించారు. రూ.2వేల ఆలస్య రుసుముతో సెప్టెంబరు 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. సెప్టెంబరు 8 నుంచి సీపీజీఈటీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని