Marriage: ఆ విషయం దాచి.. నర్సుతో వైద్యుడి రెండో వివాహం

తాజా వార్తలు

Published : 06/09/2021 07:55 IST

Marriage: ఆ విషయం దాచి.. నర్సుతో వైద్యుడి రెండో వివాహం

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: అతనో వైద్యుడు.. వివాహమైంది. ఈవిషయాన్ని దాచిపెట్టి తన దగ్గరే పనిచేస్తున్న నర్సుతో ప్రేమాయణం నడిపి వివాహం చేసుకున్నాడు. అతరువాత అతనికి వివాహమైన విషయం తెలిసింది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో ఆమెపై దాడి చేయించాడు. ఇదీ ఓ హోమియో వైద్యుడి నిర్వాకం. బాలాజీనగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బోడిగాడితోటకు చెందిన ఓ యువతి ఓ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. అదే ఆసుపత్రిలో హోమియో డాక్టర్‌ బాలకోటేశ్వరరావు పనిచేస్తున్నారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. బాలకోటేశ్వరరావు తనకు పెళ్లయిందన్న విషయాన్ని దాచి పెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత వివాహమైందన్న విషయం బయటపడింది. బాధితురాలు నిలదీయగా బాగా చూసుకుంటానని నమ్మించాడు. ఈవిషయమై విభేదాలు పెరిగాయి. శనివారం ఓ వ్యక్తి ఆమె ఇంటికి వచ్చాడు. నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల వద్దకు డాక్టర్‌ రమ్మని చెప్పగా ఆమె వెళ్లింది. డాక్టర్‌ కారు డ్రైవరు మనోహర్‌రెడ్డి ఆమెను కులం పేరుతో దూషించి దాడి చేశాడు. బాధితురాలు ఎస్పీ విజయరావుకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు బాలాజీనగర్‌ పోలీసులు డాక్టర్, అతని డ్రైవరుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కేసు నమోదు చేశారు. మరోవైపు యువతి, ఆమె కుటుంబ సభ్యులు తనపై దాడి చేసి గాయపరచడమే కాకుండా, కారు అద్దాలు పగులగొట్టారని మనోహర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని