పసికందుపై దాడి కేసు.. చురుగ్గా దర్యాప్తు 
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 08:37 IST

పసికందుపై దాడి కేసు.. చురుగ్గా దర్యాప్తు 

అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు


సంఘటనా స్థలంలో విచారిస్తున్న దిశ ఎస్సై ఉదయలక్ష్మి, పోలీసు సిబ్బంది

మాచర్ల గ్రామీణ, విజయపురిసౌత్, న్యూస్‌టుడే: మాచర్ల పరిధిలోని ఓ గ్రామంలో ఏడు నెలల పసికందును గాయపరిచి ముళ్లపొదల్లో పడేయడంపై విజయపురిసౌత్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పసికందుపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఈ ఘటనపై నరసరావుపేట దిశ డీఎస్పీ రవిచంద్ర, ఎస్సై ఉదయలక్ష్మితో పాటు పోలీసు సిబ్బంది బుధవారం విచారణ చేపట్టారు. పసికందును పడేసిన స్థలాన్ని పరిశీలించారు. ఏమి జరిగి ఉంటుంది.. ఎవరెవరిపై అనుమానాలు ఉన్నాయనే దానిపై వివరాలు రాబట్టారు. పసికందు తండ్రికి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాదాలున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న ఆ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో వచ్చి ఊయలలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. చిన్నారి ఒంటిపై పంటి గాట్లు ఎవరు పెట్టారు.. కావాలనే నిందితుడు గాయపరిచాడా.. అన్న కోణంలోనూ విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు పాపను అపహరించినట్లు అనుమానిస్తున్న వ్యక్తితో పాటు మరోవ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విజయపురిసౌత్‌ ఎస్సై అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కేసు విషయంలో అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

చిన్నారి మెదడులో రక్తస్రావం
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: అఘాయిత్యం జరిగిన చిన్నారి మెదడులో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. ముళ్ల పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఏడు నెలల పసిబిడ్డను మంగళవారం రాత్రి గుంటూరు సర్వజనాసుపత్రి న్యూరోసర్జరీ విభాగంలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం మెదడులో రక్తస్రావం జరిగి గడ్డ కట్టినట్లు తెలుసుకున్నారు. దీనికి శస్త్రచికిత్స చేయడానికి అవకాశం లేదని, కేవలం ఔషధాలతోనే చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మెదడులో సమస్య తలెత్తినందున ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి ఈ దశలో ఏమీ చెప్పలేమని నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా పసికందుపై లైంగిక దాడికి పాల్పడ్డారా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. ప్రస్తుతం న్యూరోసర్జరీ, పీడియాట్రిక్స్, గైనిక్‌ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని