TIDCO houses: వచ్చే నెలలో లబ్ధిదారులకు అందిస్తాం: బొత్స సత్యనారాయణ

తాజా వార్తలు

Published : 28/07/2021 14:53 IST

TIDCO houses: వచ్చే నెలలో లబ్ధిదారులకు అందిస్తాం: బొత్స సత్యనారాయణ

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను వచ్చే నెలలో లబ్ధిదారులకు అందించనున్నట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టిడ్కో, మెప్మా, బ్యాంకు అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత సమయంలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లను పూర్తి ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. మిగిలిన ఇళ్లకు బ్యాంకు రుణాల మంజూరులో టిడ్కో, మెప్మా, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో 2,92,000 ఇళ్లు నిర్మాణంలో ఉన్నట్లు బొత్స చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని