TS NEWS: ‘నేతన్నకు చేయూత’ పథకానికి రూ.30కోట్లు మంజూరు

తాజా వార్తలు

Published : 03/08/2021 16:48 IST

TS NEWS: ‘నేతన్నకు చేయూత’ పథకానికి రూ.30కోట్లు మంజూరు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికుల లబ్ధికి 'నేతన్నకు చేయూత' పథకం పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేతన్నకు చేయూత కోసం రూ.30కోట్లు మంజూరుకు పరిపాలనా అనుమతులు ఇస్తూ బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా దాదాపు 35వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. చేనేత కార్మికులు తమ వేతనాల నుంచి ప్రతినెలా 8శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం దానికి రెట్టింపుగా  16 శాతం, మరమగ్గాల కార్మికులు 8శాతం పొదుపు చేస్తే దానికి మరో 8శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. గడువు ముగిశాక వడ్డీతో కలిపి కార్మికులకు అందజేస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని