Ramappa Temple: 550 ఏళ్లు అడవుల్లోనే..!

తాజా వార్తలు

Updated : 26/07/2021 10:12 IST

Ramappa Temple: 550 ఏళ్లు అడవుల్లోనే..!

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: 1213లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో సుమారు 110 సంవత్సరాల పాటు ధూపదీప నైవేద్యాలతో వైభవంగా పూజలు కొనసాగాయి. ముస్లిం రాజుల దండయాత్రతో కాకతీయుల ప్రస్థానం ముగియడంతో సుమారు 550 సంవత్సరాల పాటు ఎలాంటి ఆదరణ లేక చిట్టడవుల్లో, కారుచీకట్లలో కమ్ముకుపోయింది. నిజాం రాజుల దగ్గర పనిచేసే సామంత రాజు ఆసీఫ్‌జాహీల్‌ వేటకు వచ్చిన సమయంలో ఆలయం ఆయన కంట పడింది. 1900లో ఆయన దానిని గుర్తించి దేవాలయం అంచులు పడిపోకుండా సిమెంట్‌ దిమ్మెలను ఏర్పాటు చేయించారు. పరిసరాలను పరిశుభ్రం చేసి వెలుగులోకి తీసుకువచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1951లో పురావస్తు శాఖ దీనిని ఆధీనంలోకి తీసుకుంది. అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సవాల్‌గా తీసుకుని యునెస్కో మెప్పు పొందేలా తీర్చిదిద్దారు. దీంతో ఇప్పుడు ప్రపంచ వారసత్వ హోదా సాధ్యమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని