Rowdy Boys: అలరిస్తోన్న ‘రౌడీ బాయ్స్‌’ టీజర్‌

తాజా వార్తలు

Published : 20/09/2021 23:12 IST

Rowdy Boys: అలరిస్తోన్న ‘రౌడీ బాయ్స్‌’ టీజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. హర్ష్‌ కొనుగంటి దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ‘కాలేజ్‌ ఈజ్‌ ఏ వండర్‌ఫుల్‌ ప్లేస్‌’ అనే సంభాషణతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం అలరిస్తోంది. ఓ అమ్మాయి కోసం రెండు కళాశాలల విద్యార్థుల మధ్య సాగిన చిన్న చిన్న గొడవలు, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆశిష్, అనుపమ జంట చూడముచ్చటగా ఉంది. టీజర్‌ ముగింపులో ‘మేం రౌడీ బాయ్స్‌’ అంటూ హీరో గ్యాంగ్‌ చెప్పిన తీరు ఆసక్తిగా ఉంది. మరి ఈ ‘రౌడీ బాయ్స్‌’ కథేంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని