Corona Virus: మహారాష్ట్రలో పెరుగుతోన్న డెల్టా వ్యాప్తి..!

తాజా వార్తలు

Published : 21/09/2021 13:41 IST

Corona Virus: మహారాష్ట్రలో పెరుగుతోన్న డెల్టా వ్యాప్తి..!

ముంబయి: దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తున్నా.. కరోనా వైరస్ రూపం మార్చుకుంటూ విస్తరిస్తూనే ఉంది. తగ్గినట్టే తగ్గి, కొత్త మార్పులతో కోరలు చాస్తోంది. ఇప్పటికే డెల్టా రకం ప్రపంచదేశాలకు విస్తరించి, వణికిస్తోంది. కాగా, మహారాష్ట్రలో మాత్రం డెల్టాలోని ఏవై.4 రకం కేసులు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. 

మహారాష్ట్రలో ఏప్రిల్‌ నెలలో పరీక్షించిన నమూనాల్లో ఒక శాతం కేసుల్లో ఏవై.4 రకాన్ని గుర్తించారు. జులైలో రెండు శాతం, ఆగస్టులో అకస్మాత్తుగా 44 శాతం నమూనాల్లో ఈ రకం బయటపడినట్లు ఆ కథనం పేర్కొంది. ఆగస్టులో 308 నమూనాలను విశ్లేషించగా..111(36 శాతం) డెల్టా, 137(44 శాతం) ఏవై.4 కేసులు వెలుగుచూశాయి. ఈ రకం కరోనా వైరస్‌ ప్రభావం, వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో గుర్తించేందుకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ప్రత్యేక బృందాన్ని నియమించింది. ‘వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, వ్యాధి తీవ్రత, బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్లకు కారణమని నిర్ధారణ అయిన వాటినే ఆందోళన కలిగించే రకంగా వర్గీకరిస్తాం’ అని ఆ నివేదికలో ఓ వైద్య నిపుణుడు వెల్లడించారు. ఇప్పటికైతే దీన్ని ఆందోళన కలిగించే రకంగా వర్గీకరించలేదని చెప్పారు. మహారాష్ట్రలో ప్రస్తుతం రెండు వేలకు పైగా కరోనా కేసులు, 28 మరణాలు చోటు చేసుకొన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని