AP News: నేడు కోస్తాలో భారీ వర్షాలు!
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 07:48 IST

AP News: నేడు కోస్తాలో భారీ వర్షాలు!

ఈనాడు, అమరావతి: వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ- 7.6 కి.మీ మధ్య విస్తరించింది. దీని ప్రభావంతో ఈ నెల 23న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వివరించారు. కోస్తాలో గురువారం చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని