AP News: సీఎం ఇష్టాన్ని ఎవ్వరం కాదనలేం!: పిల్లి సుభాష్‌ 

తాజా వార్తలు

Updated : 25/11/2021 08:17 IST

AP News: సీఎం ఇష్టాన్ని ఎవ్వరం కాదనలేం!: పిల్లి సుభాష్‌ 

నాడు మండలి రద్దు రాజకీయ నిర్ణయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘శాసనమండలి రద్దు రాజకీయ నిర్ణయం. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగానే సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన ఇష్టం.ఎవరూ కాదనలేం. దానికనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత సుశిక్షితులైన పార్టీ సభ్యులుగా మాపై ఉంటుంది’ అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ స్పష్టంచేశారు. మండలి రద్దు నిర్ణయంతోనే మీరు పార్లమెంటుకు వెళ్లారు... ఇప్పుడు యథావిధిగా కొనసాగించమని మళ్లీ తీర్మానం చేశారు. దీనిపై మీ స్పందనేంటి? అని విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. సచివాలయం ఆవరణంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడంలో ఛైర్మన్‌ నిబంధనలు పాటించనప్పుడు ఆయన ఆదేశాల్ని కార్యదర్శి ఎలా పాటిస్తారని, ఆ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం తప్పని చెప్పారు. ‘బీసీల జనగణనపై శాసనసభలో తీర్మానం చేయడం చరిత్రాత్మక నిర్ణయం. ఇది చాలా ఏళ్లుగా ఉన్న డిమాండ్‌. చాలా రాష్ట్రాలు దీనిపై తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తున్నాయి. రాబోయే జనాభా లెక్కల్లో బీసీల గణన జరపాలని ప్రధాని మోదీని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని