
తాజా వార్తలు
కొల్లు రవీంద్ర నివాసం వద్ద ఉద్రిక్తత
మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనలో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు తెదేపా నాయకులను పోలీసులు విచారించారు. విచారణలో భాగంగా తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రవీంద్రను స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది.
పేర్ని నానిపై దాడికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని ఇప్పటికే పోలీసులు కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు. కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించి చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా ఆధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఆయన ఇంటికి చేరుకున్న ఇనుగుదురుపేట సీఐ శ్రీనివాస్, పోలీసులు కాసేపట్లో రవీంద్రను మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లనున్నట్టు సమాచారం. అయితే.. లిఖిత పూర్వకంగా వివరణ నమోదు చేసుకున్నాక స్టేషన్‌కు ఎందుకు రావాలని కొల్లు రవీంద్ర పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు అనుసరిస్తున్న విధానం సరికాదన్నారు. ఏమాత్రం సంబంధం లేని విషయంలో తనను విచారించేందుకు స్టేషన్‌కు రమ్మనడం భావ్యం కాదని, ఈ అంశంపై పునరాలోచన చేయాలని కొల్లు రవీంద్ర ..పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. పోలీసులు రాక.. సమాచారం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు, అభిమానులు రవీంద్ర ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో మచిలీపట్నంలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
