
తాజా వార్తలు
ఉద్రిక్తంగా ప్రజాభిప్రాయ సేకరణ
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో జాతీయ పెట్టుబడులు మౌలిక వనరుల ప్రాజెక్టు భూసేకరణకు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులో ఉద్రిక్తత నెలకొంది. న్యాల్కల్, ఝరాసంఘం మండలాల పరిధిలోని 17 గ్రామాలకు చెందిన రైతులు, గ్రామస్థులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. . సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతుండగా రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమావేశానికి వచ్చే ప్రధాన మార్గాల్లో ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆందోళన కారులను అడ్డుకున్నారు. పోలీసుల, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు కిందపడ్డారు.
ఇవీ చదవండి...
ఎల్ఆర్ఎస్పై హైకోర్టు కీలక ఆదేశం
టీకా తెరిస్తే ఆలోగా వాడేయాలి.. లేదంటే
Tags :