బండి సంజయ్‌ పర్యటనలో ఉద్రిక్తత
close

తాజా వార్తలు

Updated : 25/12/2020 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బండి సంజయ్‌ పర్యటనలో ఉద్రిక్తత

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ జడ్పీ ఛైర్‌ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు నిరసనకు దిగాయి. భాజపా, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెరాస శ్రేణులను అక్కడి నుంచి పంపించేయాలని భాజపా కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. బండి సంజయ్‌ జగిత్యాల చేరుకునే సమయంలో తెరాస శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం బండి సంజయ్‌ పర్యటన కొనసాగింది.

 ఇవీ చదవండి...
మన టీకాపై ప్రపంచ దేశాల దృష్టి!

తాడిపత్రిలో ఎమ్మెల్యే దౌర్జన్యం



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని