
తాజా వార్తలు
రాజాసింగ్ రోడ్‌షోలో స్వల్ప ఉద్రిక్తత
హైదరాబాద్: గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షోలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం కేపీహెచ్‌బీ కాలనీ నుంచి రాజాసింగ్ రోడ్ షో ప్రారంభమైంది. బాలాజీ నగర్ డివిజన్లో రోడ్‌షో కొనసాగుతున్న సమయంలో అదే దారిలో వచ్చిన తెరాస నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. భాజపా నాయకులు వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా భాజపా శ్రేణులు కూడా నినాదాలు చేయడంతో పోటా పోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరలిల్లింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలను వెనక్కి వెళ్లిపోవాలని తెరాస కార్యకర్తలు నినాదాలు చేయడం సరికాదని పలువురు భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.
Tags :
రాజకీయం
జిల్లా వార్తలు