పట్టాభి నివాసం వద్ద ఉద్రిక్తత
close

తాజా వార్తలు

Updated : 02/02/2021 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పట్టాభి నివాసం వద్ద ఉద్రిక్తత

విజయవాడ: దుండగుల దాడిలో గాయపడిన తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దాడి నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి వినతిపత్రం అందించేందుకు పట్టాభి సహా తెదేపా నేతలు యత్నించారు. ధ్వంసమైన కారుతోనే సీఎం నివాసానికి బయల్దేరేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దుండగుల దాడిలో గాయాలైన పట్టాభిని పోలీసులు బలవంతంగా వాహనంలో ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పలువురు తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

మార్గమధ్యంలో పట్టాభిని తరలిస్తున్న వాహనాన్ని మహానాడు రోడ్డు వద్ద తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. తామే ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు తన భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని పట్టాభి భార్య చందన అన్నారు. 

ఈ ఉదయం పట్టాభి తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి బయల్దేరుతుండగా విజయవాడలోని ఆయన నివాసం వద్ద దుండగులు ఆయనపై దాడి చేసి గాయపరిచారు.ఈ ఘటనలో పట్టాభి సెల్‌ఫోన్‌ ధ్వంసమైంది. సుమారు 10 మంది దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి..

తెదేపా నేత పట్టాభిపై దాడి

‘ప్రశ్నిస్తే చంపేస్తారా?నన్నూ చంపండి’Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని