రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో తిరుమలేశుడు
close

తాజా వార్తలు

Published : 25/03/2021 21:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో తిరుమలేశుడు

తిరుమలలో వైభవంగా తెప్పోత్సవం

తిరుమల: తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు చూడముచ్చటగా సాగుతున్నాయి. రెండోరోజైన గురువారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో తిరుమలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత శ్రీవారిని ఆలయం నుంచి తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తూ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. పుష్కరిణి వద్ద అర్చకులు స్వామివారికి హారతులిచ్చి ప్రదక్షిణ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీవారు తెప్పలపై కనులపండువగా ఊరేగారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభమైన తెప్పోత్సవాలు ఈ నెల 28న పౌర్ణమి వరకు సాగనున్నాయి. రేపు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిగా శ్రీవారు తెప్పలపై విహరించనున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని