close

తాజా వార్తలు

Updated : 04/01/2021 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏడోసారి చర్చలు.. ఉద్యమం ముగిసేనా?

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై ఉద్యమం చేస్తున్న రైతు సంఘాల నాయకులతో నేడు కేంద్రం ఏడో విడత చర్చలు జరపనుంది. రైతుల ప్రధాన డిమాండ్లు అయిన మూడు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. కాగా..  కొత్త చట్టాలను ఉపసంహరిస్తేనే ఉద్యమం ఆపేస్తామని అన్నదాతలు ఘంటాపథంగా చెబుతున్నారు. ‘మా డిమాండ్లు ఏం మారలేదు. చట్టాలు రద్దు చేయాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. నేటి చర్చల్లో అవి నెరవేరకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. జనవరి 6, 26 తేదీల్లో ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహిస్తాం’ అని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. 

సరిహద్దుల్లోనే అన్నదాతలు

మరోవైపు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. దేశ రాజధానిలో చలి గాలులు వీస్తున్నా.. వర్షం తడిపేస్తున్నా అన్నదాతలు వెనక్కి తగ్గట్లేదు. తీవ్రమైన చలిలోనూ ‘జై జవాన్‌-జై కిసాన్‌’ అని నినాదాలు చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆందోళన నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో ఇంకా మూసివేత కొనసాగుతూనే ఉంది. ఘాజీపూర్, చిల్లా రహదారులను పాక్షికంగా మూసివేయడంతో వాహనదారులు ప్రత్నామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. 

రైతులు, కేంద్రం మధ్య జనవరి 1న ఆరోవిడత చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమావేశంలో కేవలం రెండు అంశాలపైనే కేంద్ర మంత్రుల బృందం, రైతు సంఘాల నేతలు ఏకాభిప్రాయానికి రాగలిగారు. కీలకమైన చట్టాల రద్దు, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ హామీపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కాగా.. చట్టాల రద్దుకు ప్రభుత్వం అంగీకరించట్లేదని సమాచారం. మరి నేటి చర్చల్లోనైనా ఈ సమస్య పరిష్కారమవుతుందో లేదో చూడాలి..!

ఇవీ చదవండి..

చలికి వణికి.. వర్షంలో తడిసి

యంత్రం.. సాగు మంత్రం



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని