రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉంది: ఈటల 
close

తాజా వార్తలు

Updated : 16/04/2021 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉంది: ఈటల 

హుజూరాబాద్‌: తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత వాస్తవమేనని.. అయితే కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గతంలో కంటే మరింత వేగంగా కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్లు ఈటల చెప్పారు. అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని.. కానీ హామీ మాత్రం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ,  144 సెక్షన్‌లు పెట్టే ఆస్కారం లేదని మంత్రి స్పష్టం చేశారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

‘‘కరోనా టీకా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్‌ సప్లై లేదు. ఈ టీకా రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కునేది కాదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత వాస్తవమే.. కొరత లేకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలో యంత్రాంగమంతా పనిచేస్తోంది. రెండో దశ కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. వైరస్‌ నివారణకు నియంత్రణ, ప్రభుత్వ పరంగా ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలి. రాష్ట్రంలో రానున్న రోజుల్లో కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉంది. కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా తోడ్పాటును అందించాలి. ఆరోగ్యశాఖ పూర్తి యంత్రాంగమంతా ప్రజలకు సేవలందిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు’’ అని ఈటల తెలిపారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని