కొనసాగుతున్న మూడోదశ పోలింగ్‌
close

తాజా వార్తలు

Updated : 17/02/2021 12:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనసాగుతున్న మూడోదశ పోలింగ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 2,639 సర్పంచి, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ మొదలయింది. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల దాకా, మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 దాకా పోలింగ్‌ కొనసాగనుంది.  13 జిల్లాల్లోని 160 మండలాల్లో 26,851 పోలింగ్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సుమారు 55,75,004 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో దశలో 3,221 గ్రామ పంచాయతీల్లో 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో సర్పంచి, వార్డుసభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్‌ వేయలేదు.

మావోయిస్టు ప్రాంతాల్లో భారీ భద్రత
మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లోని 172 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌కు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్‌ 11 మండలాల్లోని 237 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ కొనసాగుతోంది.మావోయిస్టు  ప్రభావిత మండలాలైన పెదబయలు, ముంచింగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి వీటిలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్‌లలోని 11 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని