కుర్చీలతో కొట్టుకున్న వైకాపా, తెదేపా వర్గీయులు
close

తాజా వార్తలు

Updated : 17/02/2021 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుర్చీలతో కొట్టుకున్న వైకాపా, తెదేపా వర్గీయులు

పూసపాటిరేగ: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలోని ఓ పోలింగ్ బూత్‌లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెదేపా, వైకాపాలకు చెందిన రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. జిల్లాలోని పూసపాటిరేగ మండలం చౌడవరంలో ఓటర్లను పోలింగ్‌ బూత్‌కు తీసుకొచ్చే విషయంలో రెండు పార్టీల వర్గీయులు గొడవకు దిగారు. గొడవ తారస్థాయికి చేరి పోలింగ్‌ బూత్‌లో పోలీసుల సమక్షంలో పరస్పర దాడికి దిగడమే కాకుండా కుర్చీలతో కొట్టుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపుచేసి పరిస్థితిని చక్కదిద్దారు. రెండు వర్గాల మధ్య కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ప్రజలు కాస్త భయాందోళనకు గురయ్యారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని