ఎండుటాకును కాదు నేను సీతాకోకను..!
close

తాజా వార్తలు

Published : 12/06/2021 00:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎండుటాకును కాదు నేను సీతాకోకను..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలో మొత్తం 17,500కి పైగా సీతాకోక చిలుకల రకాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందులో ఒక రకం ఓక్ లీఫ్‌. ఇది భారత్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే డెడ్‌లీఫ్‌ అని కూడా పిలుస్తారు. రుతువులను బట్టి ఇవి రంగులను మారుస్తుంటాయి. అడవుల్లో తరచుగా కనిపించే ఈ రకం సీతాకోక చిలుకలు అరుదుగా జనావాసాల్లోకి వస్తుంటాయి.

తాజాగా డెడ్‌లీఫ్‌ సీతాకోక చిలుకకు సంబంధిచిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఎండుటాకులా కనిపిస్తోన్న సీతాకోక చిలుకను ముట్టుకోగా అది రెక్కలు విప్పి ఎగురుతూ కనిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రకృతి చాలా అందమైందని, అందులో ఎన్నో వింతలు దాగి ఉన్నాయని వ్యాఖ్యలు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని