Anand Mahindra: ఈ దూరం ప్రమాదకరం
close

తాజా వార్తలు

Published : 01/05/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anand Mahindra: ఈ దూరం ప్రమాదకరం

ముంబయి: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న వేళ భౌతిక దూరం పాటించేందుకు ప్రజలు పలు చర్యలు చేపడుతున్నారు. వైరస్‌ దరిచేరకుండా అప్రమత్తతతో వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు అతిశయోక్తులకు పోతున్నారు. ఓ ప్రమాదకరమై ఫీట్‌ చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. కాపాడుకోవడం కంటే ఇది మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. నిచ్చెనకు రెండు చివర్లలో తలలు దూర్చి ఇద్దరు వ్యక్తుల రోడ్డు మీద రెండు బైకులపై ప్రమాదకరంగా వెళుతున్న ఓ ఫొటోను ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. 2017 నుంచి ఇంటర్నెట్‌లో తిరుగుతున్న ఆ ఫొటోని షేర్‌ చేసిన ఆయన.. ఆ ఫొటోను ప్రస్తుత పరిస్థితులకు ఆపాదిస్తూ స్పందించారు. ‘ఈ విపత్కర సమయంలోనూ ఈ ఫొటో నవ్వును తెప్పిస్తోంది. భౌతిక దూరం కోసం ఈ తరహా స్టంట్లు చేయడం ప్రమాదాలు తెచ్చిపెడతాయి’ అంటూ పేర్కొన్నారు. 

సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే ఆనంద్‌ మహీంద్రా నవ్వించే, ఆలోచింపజేసే, వర్తమాన అంశాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. కరోనా కష్టకాలంలో అప్రమత్తంగా ఉండే పలు అంశాలతోపాటు, ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో తెలిపే పలు ఫొటోలను కూడా ఆయన నెటిజన్లతో పంచుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని