close

తాజా వార్తలు

Published : 05/04/2021 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జనాలకు కరోనా భయం లేదా?!

దేశంలో లక్షదాటిన కరోనా కేసులు

(ఓ ప్రచార కార్యక్రమానికి హాజరైన జనవాహిని)

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశలో రోజూవారీ కేసులు లక్షమార్కును దాటాయి. అమెరికా తర్వాత ఈ స్థాయి కేసులు మనదేశంలోనే నమోదవుతున్నాయి. ఇంత తీవ్రంగా వైరస్ విజృంభిస్తున్నా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని ప్రచార కార్యక్రమాల్లో మాత్రం దాని ప్రభావం పెద్దగా కనిపించట్లేదు. అగ్రనేతలు హాజరవుతోన్న ర్యాలీల్లో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. బహిరంగ సభల్లో జనాలు మాస్కులు లేకుండా కిక్కిరిసి కనిపిస్తున్నారు. 

అస్సాం ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వా ఇటీవల ‘అసోంలో కొవిడ్ లేదు. మా రాష్ట్రంలో మాస్కులు ధరించాల్సిన పనిలేదు. ఒకవేళ ఆ అవసరం ఉందనుకుంటే మేమే ప్రజలకు సమాచారం ఇస్తాం’ అని బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ప్రజలు మాస్కులు ధరిస్తే బ్యూటీ పార్లర్లు ఎలా నడుస్తాయంటూ ఎదురు ప్రశ్న కూడా వేశారు.  మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూవంటి ఆంక్షల వైపు మొగ్గు చూపుతుంటే పశ్చిమ్ బెంగాల్‌లో కరోనా గురించి ఆలోచనే లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలకు అధికారమే పరమావధి కావటం దీనికి కారణమంటున్నారు. వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా ఉంది. అక్కడ ఆదివారం 3,581 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఎన్నికల వేళ డీఎంకే నేత కనిమొళికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. పశ్చిమ్‌ బెంగాల్‌లో 1,957 మంది ఆదివారం ఒక్కరోజే కొవిడ్ బారిన పడ్డారు.అయితే కేసుల నమోదుకు భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండో దశలో మరణాలు తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని