Corona: తండ్రి, ఇద్దరు కుమారులు మృతి
close

తాజా వార్తలు

Published : 20/04/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: తండ్రి, ఇద్దరు కుమారులు మృతి

ఆ కుటుంబంలో మరో ముగ్గురికి పాజిటివ్‌

జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కరోనా బారినపడి ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల పట్టణానికి చెందిన రామచంద్రం(55) అనే వ్యక్తి కుటుంబంలో ఆరుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇవాళ కరోనాతో రామచంద్రం చిన్న కుమారుడు సుమన్ (33) మృతి చెందారు. వారం క్రితం రామచంద్రం ప్రాణాలు కోల్పోయారు. ఆయన అంత్యక్రియలు పురపాలక సిబ్బంది సహకారంతో నిర్వహించారు. ఐదు రోజుల క్రితం రామచంద్రం పెద్ద కుమారుడు సునీల్‌ (35) కొవిడ్‌కు బలయ్యారు. చిన్న కుమారుడు సుమన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ వార్డు కౌన్సిలర్ మల్లవ్వ, ఆమె భర్తతో కలిసి పీపీఈ కిట్లు ధరించి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామచంద్రం ఇంట్లో ప్రస్తుతం ఆయన పెద్దకుమారుడు సునీల్‌ భార్య, ఇద్దరు పిల్లలు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని