పిడుగుపాటుకు ముగ్గురు మృతి
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 10:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది.అకాల వర్షాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు. అకాలవర్షాలకు ముగ్గురు మృత్యువాత పడ్డారు. చౌటుప్పల్‌ మండలం లింగోజీగూడెంలో పిడుగుపడి దంపతులు కరుణాకర్‌రెడ్డి(60),వీణమ్మ (50) మృతి చెందారు. వీరితో పాటు ఓ పాడిగేదె మరణించింది. బొమ్మల రామారం మండలం మర్యాలలో పిడుగు పడి రాములు మృతి చెందారు.

హైదరాబాద్‌ నగరంలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మల్లాపూర్, నాచారం, ఈసీఐఎల్‌, కాప్రా, మల్కాజిగిరి, సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, అల్వాల్‌ తదితర‌ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం కలిగింది.  
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని