వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యం
close

తాజా వార్తలు

Updated : 10/04/2021 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యం

వనస్థలిపురం: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యమవడం కలకలం రేపింది. ప్రగతినగర్‌లో ఉండే ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యానికి గురయ్యారు. సీఐ మురళీమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కయాంజిల్‌లోని ప్రగతినగర్‌లో 17, 15, 14ఏళ్లు ఉండే ముగ్గురు బాలికలు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఓ విషయంలో వీరి తల్లి పెద్ద కుమార్తెను మందలించారు. ఈ క్రమంలో తల్లి, ముగ్గురు కుమార్తెల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా, శనివారం ఉదయం నిద్రలేచి చూసే సరికి ముగ్గురు కుమార్తెలు కనిపించలేదు. వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని