దా‘రుణ’ యాప్‌లు.. రూ.300కోట్లు సీజ్‌
close

తాజా వార్తలు

Published : 11/03/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దా‘రుణ’ యాప్‌లు.. రూ.300కోట్లు సీజ్‌

హైదరాబాద్: రుణ యాప్‌ల కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి బెంగళూరులో రాజశేఖర్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిత్తూరుకు చెందిన ఆయన బెంగళూరులో నివాసముంటూ తొమ్మిది ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా స్నాప్‌చాట్‌, ఓకే క్యాష్‌, మైబ్యాంకు, క్యాష్‌డి, రూపీ ఫ్యాక్టరీ, బబుల్‌ లోన్‌ వంటి రుణ యాప్‌ల సంస్థలతో రాజశేఖర్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

ఈ కేసులో ఇప్పటివరకు ప్రధాన నిందితుడు చైనాకు చెందిన ల్యాంబో, నాగరాజు సహా 21 మందిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా నాగరాజు ఇచ్చిన సమాచారం మేరకు కొన్ని రోజులుగా ఫోన్‌ నంబర్‌ ఆధారంగా రాజశేఖర్‌ కదలికలను పోలీసులు గమనించారు. మొబైల్‌ సిగ్నల్‌ ఆధారంగా అతడు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన సైబర్‌ క్రైం ప్రత్యేక బృందం ఈనెల 10న బెంగళూరు వెళ్లి రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. రుణ యాప్‌ల ద్వారా ఇప్పటివరకు రూ.వేల కోట్లు విదేశాలకు తరలించినట్లు సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రుణ యాప్‌లతో సంబంధం ఉన్నట్లు తేలిన వివిధ కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.300 కోట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాటిని స్తంభింపజేశారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని