కారు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి
close

తాజా వార్తలు

Published : 20/04/2021 22:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కారు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి

నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చలివేంద్రగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కార్మికులు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వేగంగా వస్తున్న కారు చలివేంద్రగూడ వద్దకు రాగానే టైరు పేలడంతో అదుపుతప్పింది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను ఢీకొనడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు శంషాబాద్‌ మండలం మదనపల్లి తండా వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని