TS news: నల్లొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు

తాజా వార్తలు

Published : 02/08/2021 18:52 IST

TS news: నల్లొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు నల్గొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేములపల్లి వద్ద ₹9.3 కోట్లతో తోపుచర్ల ఎత్తిపోతల, దామరచర్ల మండలం తుంగపాడువాగుపై ₹32.22 కోట్లతో వీర్లపాలెం రెండోదశ ఎత్తిపోతల, కట్టంగూరు మండలం చెరువుఅన్నారం వద్ద ₹101.62 కోట్లతో అయిటిపాముల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నీటిపారుదల శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది. గతంలో చేపట్టిన నెల్లికల్లు ఎత్తిపోతల పథకం స్వరూపం, పనుల్లో మార్పుల కోసం పనులను ప్రీక్లోజర్‌ చేసి మళ్లీ టెండర్లు పిలువాలని నిర్ణయించింది. ఈ మేరకు ₹664.80 కోట్లతో కొత్త నులకు అనుమతులు మంజూరు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని