ముగ్గురు ఆత్మహత్యాయత్నం..ఇద్దరి మృతి
close

తాజా వార్తలు

Updated : 24/03/2021 14:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముగ్గురు ఆత్మహత్యాయత్నం..ఇద్దరి మృతి

దెందులూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దెందులూరు మండలం సింగవరంలో చోటుచేసుకుంది. దెందులూరు ఎస్‌ఐ రామ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తొర్లపాడు గ్రామానికి చెందిన పావులూరు వెంకటనారాయణ(70), అతని భార్య కృష్ణ తులసి, కుమారుడు భాను వికాస్‌(33) గుంటూరు రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వీరు సింగవరం పొలాల వద్ద అపస్మారకస్థితిలో పడి ఉండటం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సమయానికే భానువికాస్‌ మృతిచెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకటనారాయణ, కృష్ణతులసిని ఏలూరు ప్రభుత్వాసుత్రికి తరలిస్తుండగా వెంకటనారాయణ మృతిచెందాడు. ప్రస్తుతం కృష్ణతులసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ముగ్గురు గుంటూరు నుంచి దెందులూరు మండలానికి వచ్చి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్‌ఐ రామ్‌కుమార్‌ తెలిపారు. 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని