నెల్లూరులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం
close

తాజా వార్తలు

Updated : 05/03/2021 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెల్లూరులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం

తోటపల్లి గూడూరు: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి గ్రామంలో ముగ్గురు గిరిజన బాలికలు అదృశ్యమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పోట్లపూడి గిరిజన కాలనీకి చెందిన ఉప్పల చెంచురామమ్మ(15), ఉప్పల సేనమ్మ(8), కవరగిరి తులసి(12) గురువారం నుంచి కనిపించడం లేదు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో రాత్రి చుట్టుపక్కల గాలించారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని