మెరీనాలో ముగ్గురు ఆంధ్రా యువకులు గల్లంతు
close

తాజా వార్తలు

Published : 12/02/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెరీనాలో ముగ్గురు ఆంధ్రా యువకులు గల్లంతు

చెన్నై: తమిళనాడులోని చెన్నై మెరీనా సముద్ర తీరంలో నీట మునిగి ఓ యువకుడు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. చనిపోయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా విద్యార్థి. మిగిలిన ఇద్దరు కృష్ణాజిల్లాకు చెందిన వారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామానికి చెందిన సూరా గోపిచంద్‌(18) ఇటీవల ఇంటర్‌ పూర్తి చేశాడు. చెన్నైలో ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశం పొందడానికి గంపలగూడెం మండలం దుందిరాలపాడు శివారు మల్లెంపాడుకు చెందిన వాకదాని ఆకాశ్‌(18) పాటు గుంటూరు గ్రామీణ మండలం పొత్తూరుకు చెందిన శివబాలాజీ(19)తో కలిసి రెండు రోజుల కిందట చెన్నై వెళ్లారు. అక్కడ ఉన్న మరో ఇద్దరు మిత్రులు రాజశేఖర్‌, శివ ప్రశాంత్‌తో కలిసి గురువారం మెరీనా తీరానికి వెళ్లారు. రాజశేఖర్‌, శివప్రశాంత్‌ ఒడ్డున ఉన్నారు. మిగిలిన వారు సముద్రంలోకి దిగి గల్లంతయ్యారు. చెన్నై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శివబాలాజీ మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

ఇవీ చదవండి
ఎంజేఆర్‌ విద్యా సంస్థల ఆధినేత ఆత్మహత్య
సగిలేరులో పడి ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని