కళింగపట్నం తీరంలో ముగ్గురి గల్లంతు
close

తాజా వార్తలు

Published : 30/03/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కళింగపట్నం తీరంలో ముగ్గురి గల్లంతు

గార గ్రామీణం:  హోలీ వేడుకల అనంతరం సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. గార మండలం కళింగపట్నం- మత్స్యలేశం సముద్రతీరంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆశీష్ శర్మ (18), చోటు(18), సందీప్‌(18) ఉపాధి నిమిత్తం జిల్లాలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం హోలీ పండగ సందర్భంగా సముద్ర స్నానం కోసం కళింగపట్నం బీచ్‌కు వెళ్లారు. సముద్రంలో స్నానం చేస్తూ యువకులు గల్లంతైనట్లు స్థానిక ఎస్సై హరికృష్ణ తెలిపారు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని