close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/02/2020 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ హీరోలను గుర్తుపట్టారా..!  

మధురమైన జ్ఞాపకాన్ని పోస్ట్‌ చేసిన యువ హీరో

హైదరాబాద్‌: అమాయకపు చూపులతో.. దేవుడికి నమస్కారం చేస్తూ.. బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్న ఈ హీరోలను గుర్తుపట్టారా..! వాళ్లు మరెవరో కాదు టాలీవుడ్‌ యువ హీరోలు రామ్‌చరణ్‌, ఆయన బావ సాయిధరమ్‌ తేజ్‌. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ చిన్నప్పుడు ఓ వేడకలో సుస్మిత, రామ్‌చరణ్‌తో కలిసి తీసుకున్న ఓ ఫొటోను సాయితేజ్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఈ ఫొటోలో సాయితేజ్‌.. చిన్నారి శ్రీజ, రామ్‌చరణ్‌కు మధ్యలో కనిపించారు. ‘చెన్నై నివాసంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. సుస్మిత, రామ్‌చరణ్‌, శ్రీజాలతో నేను’ అని సాయితేజ్‌  పేర్కొన్నారు. సాయితేజ్‌ పోస్ట్‌ చేసిన ఫొటోపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఆ ఫొటో చాలా క్యూట్‌గా ఉందంటూ వ్యాఖ్యలు పెట్టారు. ఈ ఫొటోను చూసి మెగా అభిమానులు అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది విడుదలైన ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూపండగే’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు నటుడు సాయితేజ్‌. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సోలోబ్రతుకే సో బెటర్‌’. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్‌ కథానాయిక. మరోవైపు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీంగా కనిపించనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కు జంటగా ఆలియాభట్‌ సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.