మళ్లీ జీవితం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది! 

తాజా వార్తలు

Published : 27/07/2021 00:08 IST

మళ్లీ జీవితం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది! 

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటి, యాంకర్‌ మందిరా బేడీ భర్త, దర్శకనిర్మాత రాజ్‌ కౌశల్‌ (49) జూన్‌30న గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. భర్త మరణాంతంతో కుంగిపోయిన మందిరా, ఇప్పుడిప్పుడే ఆవిషాదం నుంచి కోలుకుంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘‘నేను విలువైన, సామర్థ్యమున్న, ప్రేమచూరగొన్న వ్యక్తిని, బలవంతురాలిని’’ అనే అర్థం వచ్చే పోస్టును ఉంచారు. మళ్లీ జీవితం ప్రారంభించాల్సిన సమయం వచ్చిందనే క్యాప్షన్‌ని జత చేశారు. 1999లో రాజ్‌, మందిరాకి వివాహమైంది. ఆదంపతులు ఓ బాబుకి జన్మనివ్వగా.. ఓ పాపని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రంతో తెలుగునాట పరిచయమయ్యారు. ‘ప్యార్‌ మే కభీ కభీ’, ‘షాదీ కా లడ్డూ’ చిత్రాలకు రాజ్‌ దర్శకత్వం వహించిచారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు.. స్టంట్‌ డైరెక్టర్‌గానూ గుర్తింపు పొందారు.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని