
తాజా వార్తలు
తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే బుధవారం ఉదయం విడుదల చేసింది. ఫిబ్రవరి నెల కోటా టికెట్లను తితిదే వెబ్సైట్లో ఉంచింది. రోజుకు 20 వేల టికెట్ల చొప్పున 17 స్లాట్లలో రూ.300 టికెట్లను విడుదల చేసింది. ఒక యూజర్ ఐడీ నుంచి ఆరు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్న తితిదే.. నెలకొకసారి శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తోంది. శ్రీవారి దర్శన టికెట్లతో పాటు.. అద్దె గదులను పొందేందుకు తితిదే అవకాశం కల్పిస్తోంది.
ఇవీ చదవండి..
తిరుపతి నుంచి తెదేపా ధర్మపరిరక్షణ యాత్ర
టోల్‌ప్లాజాలకు సం‘క్రాంతి’!
Tags :